జీ తెలుగులో ఈసారి ఉగాదికి స్వీటీ అనుష్క స్పెషల్ అప్పీయరెన్సు ఇవ్వనుంది. జీ తెలుగులో ప్రసారం కానున్న ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో వదిలింది యాజమాన్యం. ఈ ఈవెంట్ పేరు ‘బాబుగారింట్లో బుట్ట భోజనం’. యాంకర్ ప్రదీప్ తో పాటు యాంకర్లు రవి మరియు భాను ఈ షోను హోస్ట్ చేయనున్నారు.
Babu Gari Intlo Butta Bhojanam – Special Guest Anushka
బాబు గారు ఎవరో కాదు, నాగబాబు గారింట్లో పండగ సందడి అన్నమాట. ఈ ఈవెంట్ కి నిహారిక కొణిదెల గెస్ట్ గా రానుంది. ఇక అనసూయ క్లాసికల్ డాన్స్, బిత్తిరి సత్తి కామెడీ, జానీ మాస్టర్ మరియు రఘు మాస్టర్ ల పెర్ఫార్మన్స్ లకు తోడు గల్లీ బాయ్స్ లొల్లి, శివశంకర్ మాస్టర్, కమెడియన్ వేణు తదితరులతో సందడి చేయనుంది.
చివర్లో అనుష్క ప్రత్యేక అతిధిగా వచ్చి ఈవెంట్ ని మరింత అందంగా మార్చనుంది. ఉగాది రోజు ప్రసారం కానున్న ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో మీరు చూసేయండి.