Amazon Deals

బిగ్ బాస్ 3 తెలుగు ఫినాలే లైవ్ అప్డేట్ – రాహుల్ బిగ్ బాస్ 3 తెలుగు విజేత

బిగ్ బాస్ 3 తెలుగు ఫినాలే

22:36 విజయవంతమైన సీజన్ కి విజయవంతమైన వ్యక్తి రావడం సంతోషం అని నాగ్ అంటూ షో ముగించారు.

22:35 చిరంజీవి గారితో సేల్ఫీ దిగారు.

22:33 శ్రీముఖి నువ్వు అందరి మనసులు గెలిచావ్ నువ్వు డల్ గా ఉండకూడదు అని అన్నారు చిరు.

22:32 చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీ చెక్ అందుకున్నాడు రాహుల్.

22:29 తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాకు ఓటు చేసిన అందరికీ పాదాభివందనం అని గట్టిగా అరిచాడు. పేరెంట్స్ కి ధన్యవాదాలు చెప్పాడు.

22:28 నా రక్తంలో ఓడిపోవడం ఉండదు. అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది శ్రీముఖి.

22:27 రాహుల్ కళ్ళలో నీళ్ళు. స్టేజికి పాదాభివందనం చేశాడు.

22:25 రాహుల్ చేయి పైకెత్తి విన్నర్ అని చెప్పారు నాగార్జున (రాహుల్ బిగ్ బాస్ 3 తెలుగు విజేత)

Rahul BB3 Telugu Winner
pic credit: star maa

22:24 ఇద్దరినీ స్టేజి మధ్యలోకి తీసుకొచ్చారు. రాహుల్ శ్రీముఖి కౌగిలించుకున్నారు

22:23 ట్రోఫీ ని స్టేజి మీదకు తీసుకొచ్చారు.

22:22 హబీబీ హిట్లర్ సినిమాలోని పాటా పాడాడు రాహుల్

22:21 శ్రీముఖి చిరంజీవి గారితో కరచాలనం చేయగా, రాహుల్ పాదాభివందనం చేశాడు.

22:20 శ్రీముఖి మరియు రాహుల్ లను నాగ్ స్టేజి మీదకు తీసుకొచ్చారు.

22:13 విరామం

22:12 అందరు కంటెస్ట్తంట్ లను చిరంజీవి గారు చాలా ఓపికతో సరదాగా పలకరించారు.

22:08 బాబా భాస్కర్ తో తమిళ్ లో మాట్లాడి చాలా బాగా నటించావు కాదు బిహవ్ చేశావు అంటూ సరదాగా మాట్లాడారు.

22:07 తమన్నా నువ్వు డేర్ అని చెప్పగా ఏడ్చింది తమన్నా.

22:05 నీది భీమవరం అని వితిక తో చిరు అనగా తబ్బిబ్బు అయ్యారు వితిక, వరుణ్.

22:04 అందరినీ పరిచయం చేస్తాను అని నాగ్ అనగా నేనే చెప్తాను అని అందరినీ పరిచయం చేసుకుంటున్నారు.

22:03 ఎక్కువగా ఏడ్చేది నువ్వేనా అని శివ జ్యోతిని అడిగారు చిరు.

22:02 నాగార్జున గారి జర్నీ వీడియో ముగిసింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు నాగ్.

21:58 నాగార్జున గారి జర్నీ ప్లే అవుతుంది.

21:57 నాగార్జున గారి కోపం డీజే లో చూపించండి అని చిరు బిగ్ బాస్ ని కోరారు.

21:55 ఉన్న ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని నాగ్ ని చిరు గారు అడగగా అందరూ నవ్వారు.

21:53 బిగ్ బాస్ చాలా పెద్ద షో. టీఆర్పీ లో బాస్ అని మెగాస్టార్ అని అన్నారు.

21:52 చిరంజీవిగారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇంత పెద్ద ఆహ్వానం అనుకోలేదు అని చిరు అన్నారు.

21:51 బిగ్ బ్రదర్ మెగాస్టార్ గారు వెల్కమ్ అని నాగ్ ఆహ్వానించారు. సైరా పాట వేశారు.

21:50 నాగార్జున గారు ఒక్కరే స్టేజి మీదకు వచ్చారు.

21:45 విరామం.

21:43 రాహుల్ బిగ్ బాస్ హౌస్ కి పాదాబివందనం చేసి ఇద్దరు కలిసి స్విచ్ ఆఫ్ చేశారు. నాగార్జున గారు ఇద్దరినీ తీసుకొని హౌస్ నుండి బయటికి వస్తారు.

21:42 బిగ్ బాస్ ఇద్దరికీ అభినందనలు తెలిపారు. లివింగ్ రూమ్ పక్కన ఉన్న స్విచ్ ని  ఆఫ్ చేసి గుడ్ బై చెప్పండి అని బిగ్ బాస్ చివరి సారిగా ఇద్దరినీ ఆదేశించారు.

21:41 నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీరు మీ డెసిషన్ చెప్పినందుకు అని నాగ్ అన్నారు.

21:40 డబ్బులనేవి ఉంటాయి పోతాయి సర్, ప్రేక్షకుల కోసం మేము పంచుకోవాలనుకోవడం లేదని రాహుల్ మరియు శ్రీముఖి చెప్పారు.

21:38 మీకొక ఆఫర్ ఇస్తున్నాను. చెరో 25 లక్షలు ఇస్తున్నాను 2 నిమిషాలు మాట్లాడుకోండి అని టైం ఇచ్చారు నాగ్.

21:37 శ్రీముఖి జర్నీ వీడియో ముగిసింది. లేడీ టైగర్ శ్రీముఖి అని నాగ్ అనగా, అందరికీ కృతజ్ఞతలు  చెప్పింది శ్రీముఖి.

21:34 శ్రీముఖి జర్నీ ప్రసారం అవుతుంది.

21:32 రాహుల్ జర్నీ వీడియో ముగిసింది. వాట్ ఏ జర్నీ రాహుల్ అని నాగ్ అనగా.. ఈ జర్నీ నేనెప్పటికీ మర్చిపోను అని చెప్పారు రాహుల్.

21:29 మీతో కలిసి మీ జర్నీ చూడాలి ఎవరిదీ చూద్దాం అని అడగ్గా మీ ఇష్టం సర్ అని చెప్పారు. దాంతో నాగార్జున గారు రాహుల్ జర్నీ బిగ్ బాస్ అని అడిగారు. రాహుల్ జర్నీ ప్రసారం అవుతుంది.

21:28 అందరూ వెళ్ళారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారా అని వారితో కూర్చొని మాట్లాడుతున్నారు నాగ్.

21:26 విన్నర్ ఎవరో డిసైడ్ అయింది వారిని తీసుకు రావడానికి నేనే లోనికి వెళ్తున్నాను అని చెప్పి లోనికి వెళ్ళారు నాగ్. ఇద్దరు హౌస్ మేట్స్ ని కౌగిలించుకున్నారు.

21:20 విరామం.. చిరంజీవి గారి ప్రోమో వచ్చింది. మిగిలిన ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మీరు చెప్పండి అని చిరంజీవి గారు నాగార్జున గారిని అడగడంతో, మీరు అడగమన్నారా అని నాగ్ కంటెస్ట్ ను అడిగారు.

21:13 నిధి అగర్వాల్ తో పెర్ఫార్మన్స్ మొదలైంది ఇస్మార్ట్ శంకర్ నుండి డీజే పాటతో.

విరామ సమయంలో వచ్చే ప్రోమోలో నాగార్జున హౌస్ లోనికి వెళ్లి తలా 25 లక్షలు ఆఫర్ చేశారు.

బాబా భాస్కర్ కిందకు వెళ్లి తన అమ్మకు నమస్కారం చేసి వెళ్లి ఇతర కంటెస్ట్ తో కూర్చున్నాడు.

సేల్ఫీ కోసం మనీనాను ఫోన్ తీసుకురా పిలవగా, మనీనాతో డాన్స్ చేస్తూ సందడి చేశారు బాబా.. ఇంట్లోను ఇలానేనా అని బాబా భాస్కర్ శ్రీమతిని అడగగా అంతకంటే ఎక్కువ అని సమాధానం చెప్పడంతో అందరూ నవ్వారు.

బాబా భాస్కర్ తన పాపను స్టేజి మీదకు ఆహ్వానించారు. పాప ఏడుస్తుంటే టాప్ 3 లో ఉన్నాను అని పాపను హత్తుకున్నారు.

ఎవరు గెలుస్తారు అని అడిగిన ప్రశ్నకు శ్రీముఖి గెలుస్తుంది అని బాబా భాస్కర్ చెప్పారు.

మనీ తీసుకోవడానికి టెంప్ట్ అయ్యావ్ కదా అని నాగార్జున గారు అడిగితే లేదు సార్ అని చెప్పాడు బాబా.

బాబా భాస్కర్ మరియు అంజలి స్టేజి మీదకు వచ్చారు. అంజలి కృతజ్ఞతలు చెప్పి స్టేజి వదిలి వెళ్ళిపోయింది.

రాహుల్ మరియు శ్రీముఖి కౌగిలించుకొని హౌస్ లోనికి వెళ్ళారు.

బాబా భాస్కర్ సూట్ కేస్ తీసుకొని బయటికి వచ్చి సేల్ఫీ తీసుకొని బయటికి వెళ్ళారు అంజలి తో కలిసి.

బాబా భాస్కర్ ఎలిమినేట్ అయినట్టు అంజలి మాస్టర్ కి చెప్పింది.

అంజలి కవర్ ఓపెన్ చేసి అందరికీ   చూపించింది కవర్ లో పేరు.

అంజలి హౌస్ లోపలి వెళ్లి టాప్ 3 లో ఒకరిని బయటికి తీసుకురావడానికి వెళ్ళింది.

శ్రీకాంత్ లోనికి వెళ్లి ముందు 10 లక్షలు ఆ తర్వాత 20 లక్షలు ఆఫర్ చేశాడు. కాని ముందుకు ఎవరూ రాలేదు. కేథరిన్ కవర్ తీసుకొని వచ్చి వరుణ్ ఎలిమినేట్ అయినట్టు చెప్పి వరుణ్ ను బయటకు తీసుకొచ్చారు.

టాప్ 5 లో మొదటగా అలీ ఎలిమినేట్ అయ్యాడు. దర్శకుడు మారుతి మరియు రాశి ఖన్నా హౌస్ లోనికి వెళ్లి ఆలీని బయటకు తీసుకొచ్చారు.బిగ్ బాస్ 3 తెలుగు ఫినాలే