కరోనా వైరస్ నిర్మూలన చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీష్ రావు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వారి భాషలో చెప్తూ కరోనా పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు. ఈ సందర్భంగా ప్రజలకు బాగా అర్ధమయ్యేలా వివరంగా చెప్తూ ఫన్నీ ముచ్చట్లు చెప్పారు.

ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అంటుర్రు

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూల్లే, చూస్తమని కలలో కూడా అనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన పరిస్థితిని మనమంతా అనుభవిస్తున్నాము. ఎన్కట ఊళ్ళే ఎవడైనా తుమ్మితే సత్తెంరా మంచిగ తుమ్మిండ్రా అందురు.. అంతేనా… ఇప్పడెవడన్నా తుమ్మితే సత్తిమిర అని ఒకటే ఉరుకుడు ఇగ… ఆటలాంటి పరిస్థితి యావత్ ప్రపంచమంతా ఎదుర్కొంటుంది.

ఏమైనప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రజల సహకారం వల్ల ఇవ్వాళ కరోనాను బాగా కట్టడి చేయడం జరిగింది. కరోనా.. కరోనా.. అంటే ఒక ముసలవ్వ అంటుంది మొన్న, ఈ కరోనా పేరు మంచిగుంది బిడ్డ.. ఈ సంపుడు మంచిగా లేదు అని. ఈ కరోనాకు మందు లేదు. మందు ఉన్నదంటే అది మనం ఎవరింట్ల వాళ్ళం ఎక్కడోల్లు అక్కడ ఉండడమే మందు.

ఇవ్వాల చెప్పిన మాట వినకుంటే ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికా గజగజ వణికి పోతంది. అమెరికా అధ్యక్షుడు, గవర్నర్లు చెప్తే అక్కడి ప్రజలు ఇనక ‘ఏ మాకేమైతది మేము అమెరికొల్లం, మందులు బాగా తెలుసు, మాకు దవాఖాన్లు బాగున్నై అని ఇష్టమున్నట్టు తిరిగిర్రు. ఏమైందియ్యాల, పిట్టలెక్క రాలిపోతుర్రు, శవాల గుట్టలు పేరుకుపోతున్నై అమెరికాల.’

అధే విధంగా ఇటలీ చిన్న దేశం. 6కోట్ల మంది జనాభా. వాళ్ళు కూడా వైద్యంల ప్రపంచంలో మేటి. ఆలాంటి దేశంలో మంచాలు సరిపోక, వెంటిలెటర్లు లేక వయసోళ్ళను లోపలికి తీసుకుంటుర్రు ముసలోల్లను బయట పారేస్తుర్రు. పాపం ముసలోళ్ళు విలవిలలాడుతుర్రు.

ఆరు కోట్ల మంది ఉన్న ఇటలీ ఆగమాగం అవుతుంటే 130 కోట్ల జనాభా ఉండే మన  దేశంలో ఆ రోగం పెరిగితే ఏమైతది మన పరిస్థితి. రాంగ నే చూస్తున్న. ఒకటే పోతున్నై బండ్లు సిద్ధిపేటకు.. ఎందుకాయ ఏం పని లేద… అంత అవసరమా అని హరీష్ రావు గారు చెప్పారు.

ఆ వీడియో మీరు చుడండి – ఎవడన్నా తుమ్మితే సత్తెంరా అందురు ఇప్పడెవడన్నా తుమ్మితే