First Corona Death in Telangana
కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి మరణం నమోదైంది. ఖైరతాబాద్ కు చెందిన 74 సంవత్సరాల వ్యక్తి ఈరోజు (28.03.2020) చనిపోయినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీడియాకు తెలిపారు.
అయితే ఆరోగ్య సమస్యలతో సదరు వ్యక్తి గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. అతను చనిపోయాక తెలిసింది అతనికి వైరస్ పాజిటివ్ అని తేలిందని చెప్పారు మంత్రి. ఈరోజు 6 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయినట్టు కూడా చెప్పారు ఆరోగ్య మంత్రి. కుత్బుల్లాపూర్ లోని ఒకే కుటుంభానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు తెలంగాణాలో 65 కేసులు నమోదయ్యాయి.
First Corona Death in Telangana
ఎయిర్ పోర్ట్ లో థర్మో స్క్రీనింగ్ చేసిన నలుగురికి ఈ వైరస్ సోకింది. ప్రజలు క్వారంటైన్ లో ఉండమంటే బయట తిరుగుతున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు.
చనిపోయిన వ్యక్తి సమాచారం అందుకున్న తరువాత మేము తీసుకొచ్చి టెస్టులు చేస్తే వైరస్ ఉందని తేలింది. లండన్ నుండి వచ్చిన వ్యక్తితో ఇతనికి కాంటాక్ట్ ఉన్నట్టు తెలిసింది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచినట్టు ఈటెల చెప్పారు.