కరోనా వైరస్ ముప్పును అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సీరీస్ ను రద్దు చేసింది బీసీసీఐ. ఇప్పటికే మొదటి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. 

ఇండియా X సౌతాఫ్రికా వన్డే సీరీస్ రద్దు

ఇప్పటికే ఐపీఎల్ 13వ సీజన్ ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే సౌతాఫ్రికా తో సీరీస్ ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

లక్నో‌లో ఆదివారం మరియు కోల్‌కతాలో బుధవారం రెండు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లకు ప్రేక్షకులను అనుమతించబోమని నిన్న రాత్రి (12.03.2020) ప్రకటించిన విషయం విదితమే. 

కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి మూడో వారంలో బంగ్లాదేశ్‌ లో జరగాల్సిన వరల్డ్ ఎలెవన్ మరియు ఆసియా ఎలెవన్ ల మధ్య జరిగే టీ20 సిరీస్‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనని రద్దు చేసుకోగా, బంగ్లాదేశ్ కూడా పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంది. 

Also Read: కరోనా దెబ్బకు ఐపీఎల్ 2020 వాయిదా