Home » ఉద్యోగం » IOCL GATE-2020 Apprentice Recruitment ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ప్రకటన – నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IOCL GATE-2020 Apprentice Recruitment ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ప్రకటన – నోటిఫికేషన్ పూర్తి వివరాలు

IOCL GATE-2020 Apprentice Recruitment. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. బీటెక్, ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఇండియన్ ఆయిల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ ఆయిల్ ఉద్యోగ ప్రకటన – IOCL GATE-2020 Apprentice Recruitment

ఇంజనీర్, ఆఫీసర్, మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇంజనీర్ ల భర్తీని గేట్-2020 పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంజనీరింగ్ లో అన్ని విభాగాలు కాకుండా ఎంపిక చేసిన విభాగాల అభ్యర్థుల ద్వారా మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది IOCL.

investment

భర్తీ చేయు ఇంజనీరింగ్ విభాగాలు

  1. కెమికల్ ఇంజనీరింగ్
  2. సివిల్ ఇంజనీరింగ్
  3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  4. మెకానికల్ ఇంజనీరింగ్

ఎంపిక విధానం – IOCL Apprentice GATE 2020 Recruitment

ఎంపిక విధానం కేవలం గ్రాడ్యుయేట్ యాప్టట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ GATE -2020 స్కోర్ ఆధారంగా ఉంటుంది. GATE – 2019 స్కోర్ పరిగణలోకి తీసుకొనబడదు.

వయస్సు పరిమితి – IOCL GATE-2020 Apprentice Recruitment

దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 జూన్ 2020 నాటికి 26 సంవత్సరాలు దాటరాదు. OBC (నాన్-క్రీమీ లేయర్) వారికి 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 మరియు PwBD అభ్యర్థులకు 10 సంత్సరాలు వయస్సు సడలింపు కలదు.

విద్యార్హతలు

అభ్యర్థులు ఎఐసిటిఇ /యుజిసి ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు /కళాశాలలు /విశ్వవిద్యాలయాలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాల నుండి ఫుల్ టైం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/ బీఈ/ అందుకు సమానమైన) నుండి కెమికల్ /సివిల్ /ఎలక్ట్రికల్ / మెకానికల్ విభాగాలలో పూర్తి చేసి ఉండాలి.

అయితే జనరల్ /ఓబిసి (ఎన్‌సిఎల్) /ఇడబ్ల్యుఎస్ కేటగిరీ అభ్యర్థులు 65% మార్కులతో మరియు షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) / షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) /పిడబ్ల్యుబిడి కేటగిరీ అభ్యర్థులు కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం – IOCL Apprentice GATE-2020

మొదట అభ్యర్థులను గేట్ – 2020 పరీక్ష ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు.. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు 1. గ్రూప్ డిస్కషన్ (జిడి) / గ్రూప్ టాస్క్ (జిటి) 2. వ్యక్తిగత ఇంటర్వ్యూ (పిఐ) నిర్వహించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తారు.

ఎంపికైన అభ్యర్థులు ఏమి పని చేయాలి – Nature of Job

ఎంపికైన అభ్యర్థులు ఇంజనీర్లు /అధికారులుగా విధులు నిర్వహించాలి. వీరు ఇండియన్ ఆయిల్ – రిఫైనరీస్, మార్కెటింగ్, పైప్‌లైన్స్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ లేదా కార్పొరేట్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆప్టిమైజేషన్ లేదా సబ్సిడియరీ / జాయింట్ వెంచర్) మొదలగు డివిజన్ లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వేతనం

ఇంజనీర్లు /అధికారులుగా ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ ప్రాథమిక వేతనంగా నెలకు రూ.50,000/- వేతనంగా చెల్లిస్తుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, గృహ వసతి మొదలగు సదుపాయాలు కల్పించబడతాయి.

పూర్తి నోటిఫికేషన్ఇక్కడ క్లిక్ చేయండి
అప్లై చేసుకొనుటకుఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 06 మే 2020

Scroll to Top