
పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్ ఔట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.
ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో బన్నీ స్మగ్లర్ గా కనిపించనున్నాడు. అయితే బుల్లితెర నటి అనసూయ భరద్వాజ్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఈ చిత్రంలో సందడి చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతలోనే మరో వార్త టాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది.
పుష్ప నుంచి అనసూయ భరద్వాజ్ ఔట్
అనసూయను కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుండి తప్పించినట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ సినిమా ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ కు రంగమత్తగా అదరగొట్టిన విషయం తెలిసిందే ఈ బుల్లితెర బ్యూటి.
అనసూయ స్థానంలో నివేదా థామస్‌ను తీసుకున్నారనే వార్త వైరల్ గా మారింది. నిజంగానే అనసూయను ఈ సినిమాలో తీసుకున్నారా? తీసుకుంటే ఆమెను కాదని నివేదా థామస్‌కు అవకాశం ఇచ్చారా? లేదంటే… ఇద్దరూ ఈ చిత్రంలో నటిస్తున్నారా అనే విషయాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.