Home » Telangana Folk Song Lyrics » Katta Meedha Kaliyapa Settu Song Lyrics – Sushma Bhupati

Katta Meedha Kaliyapa Settu Song Lyrics – Sushma Bhupati

Katta Meedha Kaliyapa Settu Song Lyrics penned by Chitikala Thirupathi Reddy, music composed by GL Namdev, and sung by Laxmi Dasa, Song Sekarana by Gaadari Janakamma.

Katta Meedha Kaliyapa Settu Song Credits

SongTelangana Folk Song
Director & ProducerChitikala Thirupathi Reddy
SingerLakshmi
MusicGL Namdev
LyricsChitikala Thirupathi Reddy
CastSushma Bhupati
Music Label

Katta Meedha Kaliyapa Settu Song Lyrics in Telugu

కట్ట మీద కలియాప సెట్టు భీమన్న
గాలి వస్తే ఊగుతాది భీమన్న
ధూళివస్తే ఊగుతాది
సంకానున్న సవితికొడుకు భీమన్న
నిదురలొచ్చి ఏడుసుతాడు
భీమన్న, నిదురలొచ్చి ఏడుసుతాడు ||2||

investment

అల్లేలదిగో మల్లేలవిగో భీమన్న
యామ్మగారి భూములిదిగో భీమన్న
అమ్మగారి భూములిదిగో
సరసమాడిన బండలదిగో భీమన్న
సల్లాలమ్మిన పల్లెలిదిగో
భీమన్న సల్లాలమ్మిన పల్లెలిదిగో ||కట్ట మీద||

కంచె మేకల పాలు బోసి భీమన్న
పెంచుకుంటీ నా ఈ కురులూ భీమన్న
పెంచుకుంటీ నా ఈ కురులూ
నువ్వు జూసే సూపులాకు భీమన్న
కురులన్నీ మరులాయే జూడు
భీమన్న కురులన్నీ మరులాయే జూడు
||కట్ట మీద||

ఒచ్చేపోయే దారిలోన భీమన్న
రచ్చాలెవడో కట్టినాడు భీమన్న
రచ్చాలెవడో కట్టినాడు
ఈ రచ్చమీద రాళ్ళు గొడుదు భీమన్న
రానుబోను తోవలేదు
భీమన్న రానుబోను తోవలేదు

కట్ట మీద కలియాప సెట్టు భీమన్న
గాలి వస్తే ఊగుతాది భీమన్న
ధూళివస్తే ఊగుతాది
సంకానున్న సవితికొడుకు భీమన్న
నిదురలొచ్చి ఏడుసుతాడు
భీమన్న, నిదురలొచ్చి ఏడుసుతాడు ||2||

Also Read latest folk song lyrics

Scroll to Top