Home » Telangana Folk Song Lyrics » KORUKUNNARORAYYA FOLK SONG LYRICS – కోరుకున్నరోరయ్య

KORUKUNNARORAYYA FOLK SONG LYRICS – కోరుకున్నరోరయ్య

by Devender

KORUKUNNARORAYYA FOLK SONG LYRICS penned & sung by Mamidi Mounika, music composed by Sv Mallikteja.

KORUKUNNARORAYYA FOLK SONG Credits

Song Category Telangana Folk Song
Lyrics Mamidi Mounika
Music Sv Mallikteja
Singer Mamidi Mounika
Music Label

KORUKUNNARORAYYA FOLK SONG LYRICS in English

Korukunnarorayya Ninnu
Kondantha Balagam Nidisi
Kolusukunnarorayya Ninnu
Nanne Nenu Marisi

Cherukunnarorayya Chethilo
Cheyyesi Otte Vedithe
Therukuntalenurayyo
Nee Thegadhempu Maatalu Telisi

Watch కోరుకున్నరోరయ్యా Video Song

https://youtu.be/7KyoEVRtZJU

KORUKUNNARORAYYA FOLK SONG LYRICS in Telugu

కోరుకున్నరోరయ్యా నిన్ను
కొండంత బలగం నిడిసి
కొలుసుకున్నరోరయ్యా నిన్ను
నన్నే నేను మరిసి
చేరుకున్నరోరయ్య చేతిలో
చెయ్యేసి ఒట్టే వెడితే
తేరుకుంటలేనురయ్యో
నీ తెగదెంపు మాటలు తెలిసి

ఎన్ని తెలిసినా అన్ని మరిసినా
నీ తోడునే నే కోరుకున్నా…
ఎంత అరిసినా అంతా మురిసినా
నావోడే గదాని నవ్వి ఓర్సుకున్నా

ఇడిసీ పోతున్నవా నన్ను
ఇడనాడి పోతున్నవా
మరిసీపోతున్నవా మాటలు
మన్నుల కలిపినవా
తెలిపీ పోతున్నవా
ప్రేమను తెంపి పోతున్నావా
తడిసీ పోతున్నారా దుఃఖంలో కుమిలిపోతున్నారా

ఎందరున్నా గాని పిల్ల నాకు
ఏదో లోటు ఉందనంటే
కొందరున్నరని మరిసీ
కొంత సోటూ నే కోరుకుంటి
అందరున్నరని తెలిసి
అందరికంటే ముందే వస్తే
నలుగురున్నరని మురిసి
నన్నిట్ల నవ్వుల పాలు జేస్తే…

తట్టుకుంటానా తప్పుకుంటానా
ఒప్పుకోనన్న ఒప్పుకోరా
ఇడిసి ఉంటానా మరిసిపోతనా
మనసు వడ్డ పిల్లనడుగుతున్నారా

ఇడిసి పోతున్నవా నన్ను
ఇడనాడి పోతున్నవా
మరిసిపోతున్నవా మాటలు
మన్నుల కలిపినవా మరిసిపోతున్నవా
మనసును మంటల కలిపినవా
ఓదార్చుతవానుకుంటే
నన్ను ఒంటరి చేస్తున్నావా

కాలిమెట్టేవై వస్తే
కండ్లకు అద్దూకుందూనేమో
పసుపు తాడువై వస్తే
పసిపాపోలే చూసుకుందేమో
పసుపు కుంకుమై వస్తే
పది కాలాలు ఏలుకుందునో
మల్లెపువ్వు వై వస్తే
మనసుతో మందలించి కూసుందునో

రామచిలుకవు, రాణి మొలుకవు
అని ఎన్నో ఊసులు చెప్పినా
రోజు మరువలే రోకు ఇడువలే
నిమిషమైనా గూడా నీ ధ్యాస ఇడువలే

ఎల్లీ పోతున్నావా నాతో
ఎడవాసి పోతున్నావా
ఏదీ గురుతులేదా
కలిసున్న కాలం యాది లేదా
మర్రీ సూడ రాదా నీ మనసును ఇచ్చి పోరా
మందాలిచ్చిపోరా మనసుకు మందూ పెట్టుకోరా

నీకు సీత దేవి లెక్క రానా లేక
రాధమ్మనై ఉండిపోనా
పార్వతమ్మనై రానా తలపులో
శివ గంగనై జారిపోనా
శివ గంగనై జారిపోనా
నీ తలపులోకి జారిపోనా

You may also like