అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ. ఈ మధ్య కాలంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలకు సంబంధించి చాలా విమర్శలు
ఎదుర్కొంటున్నారు. ఆక్లాండ్ వేధికగా ఇండియా vs న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీస్తుంది.
అంపైర్లపై ఫైర్ అయిన కోహ్లీ – జీరో టైమ్‌లో రివ్యూ అడిగితే ఎలా అంగీకారం
ఇంతకీ జరిగిందేందంటే..? ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేస్తున్న స్పిన్నర్ చాహల్ యొక్క 5వ బంతిని, నికోలస్ స్వీప్ షాట్ ఆడగా అది తై ప్యాడ్ కి తగలడంతో అప్పీల్ చేయగా ఆన్-ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ వెంటనే తన వేలును పైకి లేపాడు, కాని నికోలస్ తన భాగస్వామి గప్టిల్‌తో చర్చించిన తరువాత దానిని సమీక్షించడానికి వెళ్ళాడు. దాన్ని అంపైర్ అంగీకరించాడు.
ఇక్కడే కోహ్లీ కోపానికి కారణమైంది. ఔట్ ఇచ్చిన 15 సెకండ్లలోనే సమీక్ష కోరాల్సి ఉంటుంది. స్టేడియంలో ఉన్న పెద్ద స్క్రీన్ మీద డీఆర్ఎస్ కోరడానికి టైం జీరో చూపించింది. అయినా అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ థర్డ్ అంపైర్ కు నివేదించడంతో కోహ్లీకి చిర్రెత్తింది. జీరో
టైమ్లో ఎలా అంగీకరిస్తారని అంపైర్ తో గొడవకు దిగాడు కెప్టెన్. తాము తీసుకున్న నిర్ణయంలో తప్పుంటే థర్డ్ అంపైర్ నిర్ణయిస్తాడు అని అంపైర్లు కోహ్లీకి బదులిచ్చారు.
ఈ వాదన జరుగుతుండగానే థర్డ్ అంపైర్ రివ్యూ చూసి అవుట్ అని నిర్ణయించాడు. కెప్టెన్ కోహ్లీకి అండగా ట్విట్టర్ లో
అభిమానులు వరస ట్వీట్లతో అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.