కరోనాపై పోరాటం మరో రెండు వారాలకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పదని ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది కేంద్రం. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని అందుకే మే 17 వరకు లాక్‌డౌన్ అనే తాజా ఉత్తర్వులో పేర్కొంది హోం మంత్రిత్వ శాఖ.

లాక్‌డౌన్ లో గ్రీన్ జోన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 17 వరకు ఇచ్చిన సడలింపులు ఇవే

గమనిక: రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతుంది.

 • గ్రీన్ జోన్లలో పూర్తి స్థాయి కార్యకలాపాలకు అనుమతి.
 • ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు ఉండవు.
 • గ్రీన్ జోన్లలో ప్రజారవాణాకు అనుమతి. అయితే సీటింగ్ కెపాసిటీ మాత్రం 50% మించరాదు.
 • మందు బాబులకు పెగ్గు లాంటి వార్త. లిక్కర్, పాన్, గుట్కా, పొగాకు మొదలగు వాటికి అనుమతి.
  అయితే షాప్ ముందు అయిదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదు, ఒక్కో వ్యక్తికి కనీసం
  ఆరు (06) ఫీట్ల దూరం ఉండేలా చూసుకోవాలి.
 • పెళ్లి సంబంధమైన కార్యక్రమాలకు 50కి మించి పాల్గొనరాదు.
 • అంతిమ సంస్కారాలకు 20 మందికి మించి ఉండరాదు.
 • స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, ట్రైనింగ్/ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు మూసే ఉంచాలి.
 • హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, సినిమా హాళ్లు, జిమ్ములు, క్రీడా కాంప్లెక్స్ మొదలగునవి తెరవకూడదు.
 • ఆధ్యాత్మిక సమావేశాలపై, అన్ని ప్రార్థనా స్థలాలపై నిషేదం కొనసాగుతుంది.
 • జోన్లతో సంబంధం లేకుండా అంతరాష్ట్ర రవాణా బస్సు, రైలు, విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయి.
 • దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల రవాణా కొనసాగుతుంది. ఇందుకు ప్రత్యేక పాసులు అవసరం లేదు.
 • ఫోర్ వీలర్లలో డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు ప్రయాణించవచ్చు.
 • ఆరెంజ్ జోన్లలో ఆటోలు, క్యాబ్ లు, టాక్సీలకు అనుమతి.
 • ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు ‘ఆరోగ్య సేతు’ యాప్ తప్పనిసరి.
 • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నిర్మాణాలకు అనుమతి.
 • రెడ్ జోన్లలో మాత్రం ఏలాంటి సడలింపులు లేవు.

ఇది కూడా చదవండిమే 17 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్

Official Press Note