Home » Love Failure Songs » Marisipolene Pilla Nirakani Song Lyrics – Love Failure Song

Marisipolene Pilla Nirakani Song Lyrics – Love Failure Song

by Devender

Marisipolene Pilla Nirakani Song Lyrics penned by Nagaraju Kasani, music composed by Ramesh Thudimilla, and sung by Hanumanth Yadav. మరిసిపోలేనే పిల్ల నీ రాకని.

Marisipolene Pilla Nirakani Song Credits

Song Love Failure Song
Director Vineeth Namindla
Producers Soppari Shivaram & Chandhu
Lyrics Nagaraju Kasani
Singer Hanumanth Yadav
Music Ramesh Thudimilla
Artists Soppari Balakrishna, Srivani
Song Lable

Marisipolene Pilla Nirakani Song Lyrics

ఏ పొద్దు నిను తల్సుకున్న
సీకట్ల నా బతుకు ముగిసిపోయిందో
ఏ హద్దు లేనే లేనోన్నే
నీపట్ల సరిహద్దు గీసుకున్నానే

గుడిలోన దేవతవంటూ
గుండెల్లో సోటిచ్చినా
గుడి బయట పిచ్చోనిలా
నన్ను సులకన నువ్వు జేసినా

నాకున్న నమ్మకమేందో
నిన్ను నమ్మి ప్రేమించినా
అది తలిసి నువ్వే నన్ను
గోదాట్ల వదిలేసావే

మలినపడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్లా ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని
పడిన పడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్ల ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని

నాదానివంటూ నడ్సినా
నమ్మి వస్తానంటే తోడు నిల్సినా
నాదానివంటూ నడ్సినా
నమ్మి వస్తానంటే తోడు నిల్సినా

నీ రూపమే నాలో దాసిన
నిన్ను సంటిపాపలాగ జూసిన
ఇన్నేళ్ల బంధాన్ని సెప్పుకొని
బాధ జేసి ఎల్లిపోతనే

సురుకు వెట్టినట్టు
సూది గుచ్చినట్టు
నేను గోస వడితినే
కన్నీళ్ళు జారిన నా కంటిపాపని
ఏడుపాపమంటనే
నా గుండెకు తగిలిన గాయాన్ని సెరిపేలా
ఏదోటి సెయ్యన్నదే

మలినపడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్లా ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని
పడిన పడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్ల ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని

ఒక్కమాటైనా అనకున్నదే
కంటనీరు కన్ను దాటనన్నదే
ఒక్కమాటైనా అనకున్నదే
కంటనీరు కన్ను దాటనన్నదే

కుమిలిపోతుందే మనసంతనే
కుంగిపోతున్న బాధల్ల ఉంటినే
నిన్ను మెచ్చినోన్ని నీకు బానిసైత
నువ్వు లేక ఉండనే
నువ్వు మెచ్చినోడి ఇంటికి పని మనిషి
అయితంటే తట్టుకోనే

నా ఇంటి మారాణి
నిన్నేలుకుంటాని మాట ఇచ్చినోడినే
పూరి గుడిసెలుంట
నువ్వొప్పుకుంటే
ఏడున్న నీతోడునే

మలినపడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్లా ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని
పడిన పడ్డవే మాట తప్పుకొని
మనసు సంపుకొని పిల్ల ఎట్లుంటివే

మరిసిపోలేనే పిల్ల నీ రాకని
మరక వడ్డాదమ్మ గుండె కోసుకొని

Watch మరిసిపోలేనే పిల్ల నీ రాకని Video Song

You may also like