Home » Telangana Folk Song Lyrics » Nagamallelo Folk Song Lyrics – నాగమల్లెలో

Nagamallelo Folk Song Lyrics – నాగమల్లెలో

by Devender

Nagamallelo Folk Song Lyrics penned by Sv Mallikteja, music composed by Sv Mallikteja, and sung by Mallikteja & Mamidi Mounika.

Nagamallelo Folk Song Credits

Song Telangana Folk Song
Singer & Lyricist Mamidi Mounika & Mallikteja
Music Sv Mallikteja
Music Label MV MUSIC & MOVIES

Nagamallelo Folk Song Lyrics

Kodi Koosi Tellavaaripoyindho
Naagamallelo Teegamallelo
Enni Andhaalo Naa Pallelo
Kondasaatu Nundi Poddhu Podusindhe
Nagamallelo Teegamallelo
Enni Andhaalo Naa Pallelo

కోడి కూసి తెల్లవారిపోయిందో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని అందాలో నా పల్లేలో
కొండసాటు నుండి పొద్దు పొడుసిందో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని అందాలో నా పల్లేలో

కిలకిల పక్షులతో పల్లె కళకళలాడుతుందో
బలబల తెల్లారేనో పల్లె, బంగారు బొమ్మోలెనో
గిరుల నుండి ఝరులు పారుతుంటే
తరులు కురులు ఇరబోసి ఆడుతుంటే

పరవశమొందినాదో నేలంత
పాలు తాగుతున్నదో
ఊయలలూగుతుందో పల్లంత
ఊపిరి పీల్చుకుందో

గరిక మీద మంచు కునుకులే తీయంగ
రామ సిలకల గుంపు రాగాలు తీయంగ
అలమందలు సేల గట్లల్ల మేయంగ
రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ
(రైతన్న పనిలోకి రమ్మాని పిలువంగ)

నా పల్లె తల్లులు పొలము బాటల్లో
నాగమల్లేలో తీగమల్లేలో
తెల్ల జొన్నంబలి తాగి పోతుండ్రో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని ముల్లేలో నా పల్లేలో

కమ్మరి కిట్టయ్య కర్రు సాటేసిండు
వడ్లోల్ల లింగయ్య నాగలి చేసిండు
ముల్లుకర్ర దొత్తెలు సేత వట్టుకోని
సాగిపోతున్నారు సద్ది గట్టుకోని
(సాగిపోతున్నారు సద్ది గట్టుకోని)

అలపాట దాపట పుల్లెడ్ల గట్టీ
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని వర్ణాలో నా పల్లేలో
అరక వట్టి పొలము దున్నుతున్నారో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని వర్ణాలో నా పల్లేలో

పరవశమొందినాదో నేలంత
పాలు తాగుతున్నదో
ఊయలలూగుతుందో పల్లంత
ఊపిరి పీల్చుకుందో

నల్లని బురదల్లో సల్లాని సేతుల్తో
నాట్లు వేస్తున్నారు, నా పల్లె తల్లులు
పొట్టకొస్తే మేము పొంగిపోతామమ్మ
బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ
బాలింత నీవైతే బతుకంత వెలుగమ్మ

నేలమ్మ నీ కడుపు సల్లంగుండాలో
నాగమల్లేలో తీగమల్లేలో
ఎన్ని గంధాలో నా పల్లేలో
నిత్యము మా బతుకు పచ్చంగుండాలో
నాగమల్లేలో తీగమల్లేలో

ఎన్ని బంధాలో నా పల్లేలో
ఎన్ని గంధాలో నా పల్లేలో
ఎన్ని బంధాలో నా పల్లేలో

Watch నాగమల్లేలో తీగమల్లేలో Video Song

You may also like