పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క 26వ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిందీ చిత్రం పింక్ కు రీమేక్ గా వస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది.

ఈ సినిమాకు వకీల్ సాబ్ టైటిల్ ఖరారు చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను అలరించేలా ఉంది. చేతిలో పుస్తకం, కళ్ళజోడు పెట్టుకొని కాలుమీద కాలు వేసుకొని పడుకున్న పిక్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

నిన్ను కోరి చిత్ర ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ పింక్ చిత్రానికి రీమేక్. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. క్రిష్ (రాధా కృష్ణ జాగర్లమూడి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

ముఖ్యంగా చిత్రం మహిళా ప్రాధాన్యంగల చిత్రం అయినప్పటికీ సందేశాత్మక చిత్రం అని పవర్ స్టార్ ఇందులో నటించడం గొప్ప విశేషం. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మహిళా నటులు ఎవరూ కనిపించలేదు.

తన చివరి చిత్రం అజ్ఞాతవాసి 2018 లో విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా జనసేన పార్టీ చీఫ్ గా రాజకీయ జీవితంపై దృష్టి పెట్టారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో పార్టీ అంతగా ఉనికి సంపాదించుకోలేదు. పోటీ చేసిన 138 అసెంబ్లీ స్థానాల్లో, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకా, భీమవరం సహా దాదాపు అన్ని (ఒక్కటి మినహ) సీట్లను కోల్పోయారు.

Pawan Kalyan Vakeel Saab First Look Revealed