Ram Charan Birthday RRR Special Video
రామ్ చరణ్ పుట్టినరోజు పురస్కరించుకొని “ఆర్‌ఆర్‌ఆర్ – రౌద్రం రణం రుధిరం” చిత్రం నుండి ఆలస్యమైనా అదిరిపోయే స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ వీడియో ద్వారా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు రాజమౌళి.
“ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమట ధార కడ్తది. బాణమైనా, బంధూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి… సాకింది గోదారి…. నా అన్న… మన్నెం దొర… అల్లూరి సీతారామరాజు…” ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటది..
తెలుగు, తమిళ్, కన్నడ, మరియు హిందీ భాషల్లో వచ్చిన ఈ వీడియోలకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా బాగుంది. ఎన్టీఆర్ వాయిస్ ఈ వీడియోకు అద్భుతం అని చెప్పాలి.
ఇక వీడియోలో రామ్ చరణ్ పోలీస్ డ్రెస్ లో కనిపిస్తాడు. సిక్స్ ప్యాక్ తో అద్భుతంగా కనిపించాడు. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీయార్ నటిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం‘ చిత్రాన్ని జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా జనవరి 8, 2021న విడుదల అవుతుంది.