‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. ‘మెగా సూపర్ ఈవెంట్’ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే ఆద్యంతం సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. ‘దేవుడా! స్వీటు, క్యూటు, హ్యాండ్సమ్ కుర్రాన్ని చూపించవయ్య.., నీకు అర్దమవుతుందా…’ అంటూ రశ్మిక చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ డైలాగులు

ఐ లవ్ యూ, మీకు అర్దమవుతుందా, ఐయామ్ ఇమ్ప్రెస్డు అంటూ రశ్మిక వెల్లి మహేష్ బాబును గట్టీగా హత్తుకుంటుంది. దాంతో మహేష్ ‘అమ్మాయ్ అమ్మాయ్ ఇదిగో అమ్మాయ్.. తీసుకెల్లరా’ అంటూ అక్కడే ఉన్న సుబ్బరాజుకు చెప్తాడు.

కని, సాటి మగానిగా నేను చెప్పేది… అని మహేష్ బాబు పూర్తి చేసేలోపే బండ్ల గణేష్ కల్పించుకొని ‘మేము మగాళ్ల మాట అస్సలు వినముగా’ అని చెప్తాడు. అయితే బండ్ల గణేష్ నోట్లో బ్లేడ్ పెట్టుకొని రైల్లలో దొంగతనం చేసే వ్యక్తిగా కనిపిస్తాడు రచ్చ రవితో.

అబబబబ్బ…. ఈలాంటి ఎమోషన్స్ నెవ్వరు బిఫోరు, ఎవ్వర్ ఆఫ్టరు‘ అని సంగీత, రష్మిక ఫ్యామిలి సరదాగా చెప్తారు.
రష్మిక వెళ్లి పడుకున్న మహేష్ బాబుకు ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ వెనకాలే వచ్చిన రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ తల మీద ఒక్కటిస్తాడు.

‘సాటి సోదరికి….’ అని మహేష్ బాబు తన చేయిని రష్మిక వైపు చూపిస్తూ అనబోతుండగా అక్కడే ఉన్న హీరోయిన్ ఫ్యామిలీ చెవులు మూసుకొని ‘వయసులో ఉన్న ఆడపిల్లని నీ నోటితో సోదరి అనకు.. తట్టుకోలేదు బాబు‘ అని సంగీత చెప్తుంది మహేష్ కు. దానికి బదులుగా ‘ఏదో ఫ్లోలో అన్నానండి‘ అని మహేష్ అనగానే మరోసారి హీరోయిన్ ఫ్యామిలీ చెవులు మూసుకొని ‘బాబూ…’ అని గట్టిగా అరుస్తుంది.

మియావ్ మియావ్ పిల్లి మిల్కు బాయ్ తో పెళ్లి‘ అంటూ రాజేంద్ర ప్రసాద్ ను ఆట పట్టిస్తున్నట్టూ చేస్తుంటారు సంగీత, రష్మిక,
హరితేజ. ‘అబబబబ్బ…. ఈలాంటి డ్రామాలు నెవ్వరు బిఫోరు, ఎవ్వర్ ఆఫ్టరు.’ ఈ డైలాగ్ మహేష్ లుంగీ మీద ఉండి సంగీత,
రష్మికలను చూపిస్తూ తనదైన స్టైల్లో చెప్తాడు. ఇదంతా రైల్లో జరిగే సన్నివేశాలే.

సీన్ ఒక్కసారిగా కర్నూలు కొండారెడ్డి బురుజు వద్దకు చేరుతుంది. విజయశాంతి కాలేజ్ లో తన గదిలో రౌడీలతో ‘15 ఏళ్ళ ప్రొఫెషనల్ కెరియర్, ఇంత వరకు తప్పును రైట్ అని కొట్టలేదు‘ అంటుంది.

విలన్ గా ప్రకాశ్ రాజ్ కనిపిస్తాడు. చేతిలో గాజు గ్లాసును తిప్పుతూ ‘నేను తప్పులే చేస్తాను రెడ్డి, దాన్ని ఎవడైనా రైట్ కొట్టాల్సిందే‘ అని కోపంగా చెప్తాడు.

అర్రె… చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు‘ అని పోలిస్ పాత్రలో ఉన్న పోసాని సెల్ పోన్ లో ఏదో చూపించగా మహేష్ అలా అనగానే
మీరు తీసేస్తారు కద బాబు‘ అని పోసాని బదులిస్తాడు భయంతో.

చుట్టూ వంద మంది మధ్యలో ఒక్కడు, టచ్ చేయండి, ఎవడైనా వెళ్లి టచ్ చేయండి అని మహేష్ బాబును చూపిస్తూ వార్నింగ్
ఇచ్చేలా చెప్తుంది విజయశాంతి.

కూర్చున్న కుర్చీని లేచి ఆవేశంగా తన్ని ‘ఏయ్.. నీ కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావ, స్టేట్ మినిస్టర్ ని, ఏం మాట్లాడుతున్నావ్‘ అని ప్రకాశ్ రాజ్ వీరావేశంతో చెప్తాడు. అంతకుమించిన ఆవేశంతో లేచి తను కూర్చున్న కుర్చీని తన్ని ‘ఏయ్.. కాలేజ్ స్టూడెంట్ అనుకుంటున్నావ, స్టేట్ మినిస్టర్ వి, లేడీస్ తో ఏం మాట్లాడుతున్నావ్‘ అని కౌంటర్ ఇస్తాడు మహేష్ బాబు.

మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీకోసం ప్రాణాలు ఇస్తున్నాం అక్కడ, మీరేమో అడ్డమైన పనులు.. భాద్యతుండక్కర్ల‘ అని మహేష్ చుట్టూ ఉన్న ప్రతినిధులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా చెప్తాడు ఈ డైలాగ్.

‘చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తరవాత బొమ్మ దద్దరిల్లి పోద్ది’ అంటూ చేప్పే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది.

మీరూ చూడండి ట్రైలర్…