TS SSC Exams Again Postponed
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా దేశమంతా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో మరోమారు 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టు కు తెలుపగా పరిస్థితులు అనుకూలంగా మారే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరింది.
తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల విద్యాసంస్థలు ఇప్పటికే మూతపడ్డాయి. రాష్ట్ర హైకోర్టు తీర్పు దృష్ట్యా ముందుగా మార్చి 23 నుండి మార్చి 30 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేయగా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల మూలాన మరోసారి ఎస్సెస్సీ పరీక్షలు వాయిదా వేయక తప్పలేదు. కావున మంగళవారం నుండి జరిగే పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా షెడ్యూల్ ద్వారా తెలియజేస్తుంది.