వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘వాల్మీకి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. వరుణ్ ని సరికొత్త పాత్రలో చక్కగా చూపించారు దర్శకుడు
హరీష్ శంకర్. పూర్తిగా తెలంగాణా యాసలో గద్దలకొండ గణేష్ గా కనిపించనున్నాడు వరుణ్.
ఎఫ్ 2 తరవాత వస్తున్న వాల్మీకి చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వరుణ్. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ
చిత్రం అన్ని కార్యక్రమాలు ముంగించుకొని సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా మాస్ ప్రేక్షకులను అలరించనుంది అని చెప్పడానికి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో పంచ్ డైలాగ్ లు వింటుంటే వరుణ్ పాత్ర పవర్ ఫుల్ అని చెప్పొచ్చు.
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సినిమా ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్.