సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం. ఆమె తెల్ల కోటు వేసుకున్న డాక్టర్, కాదు దేవత. కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రిలో
ప్రాణాలను సైతం లెక్కచేయక కరోనా వైరస్ భాదితులకు ట్రీట్ మెంట్ చేసి వస్తున్న ఆమెకు తన అపార్టుమెంట్ వాసులు ఇచ్చిన
ట్రీట్ మెంట్ కు ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

సైనిక్ పురిలో వైద్యురాలికి ఘనస్వాగతం

ఆమె డాక్టర్ విజయశ్రీ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు ముంగించుకొని సైనిక్ పూరి లోని ఇంటికి చేరుకున్న తనకు తాను నివాసముండే అపార్టుమెంట్ వాసులు ఘనస్వాగతం పలికారు. చప్పట్లు కొడుతూ కేరింతలు చేస్తుంటే ఆ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో తన సేవలు మరవలేనివి.

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచం ఆరోగ్య సంక్షోభంతో బాధపడుతున్న ఈ తరుణంలో డాక్టర్లే దేవుళ్ళు. వాళ్ళ సేవలకు ఇలా
కొన్ని మాటలు రాస్తే సరిపోదు. కొంత మంది వారి మీద దాడి చేయడం అమానుషం, ఘోరం, నేరం. వారు ముందు వరుసలో
ఉండి కరోనా అనే కనపడని శత్రువుతో యుద్ధం చేస్తూ మనల్ని కాపాడుతున్నారు.

వైద్య నిపుణులు, పోలీసు సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికుల అందరికి సెల్యూట్.

మీరు ఆ వీడియో చూడండి.