ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ నియమిస్తూ ప్రకటన

0
ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌

మార్చి 29 న ప్రారంభం కానున్న ఐపిఎల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 ఏళ్ల ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తమ కెప్టెన్‌గా ప్రకటించింది ఎస్‌ఆర్‌హెచ్‌. 2018 మరియు 2019 సీజన్లో జట్టును నడిపించిన కేన్ విలియమ్సన్ నుండి వార్నర్ బాధ్యతలు స్వీకరించారు. వార్నర్ బాల్ టాంపరింగ్ చేసి నిషేదానికి గురవడంతో 2018 లో విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

వార్నర్ ఇంతకుముందు 2015, 2016, 2017 సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించాడు 2016 లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపాడు. వార్నర్ మొత్తం 45 మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌కు నాయకత్వం వహించాడు. 26 విజయాలు అందించాడు.

జట్టులో విదేశీ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలెన్ మరియు బిల్లీ స్టాన్లేక్ ఉన్నారు. వార్నర్ మరియు విలియమ్సన్‌లను టాప్ ఆర్డర్‌లో ఇద్దరు తప్పక ఆడతారు. ఓపెనర్ బెయిర్‌స్టో స్థానం మరియు రషీద్ ఖాన్ లు దాదాపు తమ స్థానాలు జట్టులో సుస్థిరం. మిగతా వారిని ఎలా వాడుకుంటాడో వార్నర్ చూడాలి.

అయితే విలియమ్సన్ ను నాయకత్వం నుండి తప్పించడంతో ట్విట్టర్ లో అభిమానులు విమర్శించారు. విలియమ్సన్ 2018 లో సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు, ముంబైలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయారు. టోర్నమెంట్‌లో 735 పరుగులతో అగ్రస్థానంలో నిలిచారు విలియమ్సన్. గత సంవత్సరం, సన్‌రైజర్స్ ఎలిమినేటర్‌లో ఢిల్లీ జట్టుతో ఓడిపోయింది, నాలుగో స్థానంలో నిలిచింది పాయింట్ల పట్టికలో.

సన్ రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 1న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ తో హైదరాబాద్ వేదికగా తలపడుతుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here