Home » Dialogue Lyrics » Work Puri Musings Dialogue Lyrics – Puri Jagannadh | Puri Connects

Work Puri Musings Dialogue Lyrics – Puri Jagannadh | Puri Connects

Work Puri Musings Dialogue Lyrics. నువ్వు బతకడానికి చేసే పని, ఇష్టమైన పని, ఉద్యగం మొదలగు అంశాల మీద పూరి చెప్పిన విషయాలు ఆయన మాటల్లో.

Work Puri Musings Dialogue Lyrics

వాడెవడైనా సరే.. వాడు పేదోడు కావొచ్చు, ధనవంతుడు కావొచ్చు. కొన్ని పనులున్నాయి, ఎవరికి వారే చేసుకోవాల్సినవి. కాలకృత్యాలు, నిద్రాహారాలు, నీ ము- నువ్వే కడుక్కోవాలి, నీ నిద్ర నువ్వే పోవాలి, నీకోసం ఎవడూ పాడుకోడు, నీ తిండి నువ్వే తినాలి, నీ సె- నువ్వే చెయ్యాలి. దాని కోసం కూలీలను పెట్టలేం కదా…

investment

ఇవి కాకుండా ఇంకో పని, WORK. బతకడానికి నువ్వు చేసే పని. చాలా మంది తిట్టుకుంటూ ఆఫీసులకు వెళ్తుంటారు. పని చేయాలంటే బద్ధకం. ఆలాంటప్పుడు ఆ పని మానేయండి. ఎందుకంటే మీకు ఆ పని ఇష్టం లేదు. శనివారం, ఆదివారం ఎప్పుడొస్తది అని ఎదురుచూస్తున్నావంటే, నువ్వు సరైన మార్గంలో లేవని అర్ధం. 90 శాతం మంది ఇష్టంలేని ఉద్యోగం చేస్తుంటారు.

కంపెనీ పెట్టిన ప్రతీ ఓనరు ఎప్పుడూ మంచి ఉద్యోగులు దొరకడం లేదని ఎందుకు ఏడుస్తాడు తెలుసా..?  ఎందుకంటే, అక్కడ పని చేసే వాళ్లంతా నటులు. వాళ్లకు ఏవో ఆసక్తులు ఉంటాయి, కానీ డబ్బు కోసం జాబులో జాయిన్ అయి, చక్కగా టై కట్టుకొని, మనముందు చాలా సిన్సియర్ గా ఉన్నట్టు కనిపిస్తారు. అవి నమ్మి చేతిలో పని పెడితే మెల్లగా సంక నాకిస్తారు. ఇంటి బాధ్యతలు, త్వరగా పెళ్ళైపోవడం వంటి ఒత్తిళ్ళ వల్ల మనకి యాక్టర్లు ఎక్కువైపోయారు. దయచేసి ఈ నటనలు మానేయండి.

‘కష్టమైనా సరే ఇష్టమైన పనే చేయండి’. మీ పని ఆటలా ఉండాలి. అలా ఉంటే ఖాళీ దొరికితే ఆదుకోవడానికి వెళ్లిపోతుంటాము. మన వర్క్ ప్లేస్ మన ప్లే గ్రౌండ్ అయిపోవాలి. దేవుడిపై ఉన్న ప్రేమను కూడా దీనిపై పెట్టేయండి. మన పనే మన మెడిటేషన్. ఏం చేసినా ఆనందంగా చేస్తే ఆధ్యాతికతతో పాటు మంచి సృజనాత్మకత నీ సొంతం.

నీకిష్టమైన పనేంటో తెలుసుకో. తర్వాత దాన్ని మతంలా మార్చేయ్. దానికి బిషప్ అయిపో, లేదంటే చిన్న నిత్యానందాలా తయారవ్వు. ఒకటి.. పనే నీ దైవం, నీ ఆఫీసె నీ దేవాలయం. రెండు.. నీకు ధర్మం కావాలనుకుంటే నువ్వు ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలను గౌరవిస్తే చాలు. కాదు నేను భగవద్గీతలో చదివాను, దుష్ఠ శిక్షణ శిష్ఠ రక్షణ అని, నేను వాన్ని సంహరిస్తాను అంటే పోలీసులు బొక్కలో వేస్తారు. ఎందుకంటే చివరగా మనం ఫాలో అవ్వాల్సింది చట్టాలను. మూడు.. నీకు మనశాంతి కావాలంటే మెడిటేషన్ చేసుకో, ఎవడాపాడు నిన్ను. ఇలా చేస్తే నీకు ఏ మతము అవసరం లేదు.

నీ వర్క్ దేవుడై పోవాలి. నా ఉద్యోగం నా మతం అని చెప్పాలి. నువ్విలా ఉంటె నీకు అందరూ సెల్యూట్ చేస్తారు. నువ్వు బాగుంటే దేశం బాగుంటది అంతే. అన్నిటికంటే కష్టం, కాలు మీద కాలు వేసుకొని ఖాళీగా కూర్చోవడం. ఈ విషయం లోక్ డౌన్ లో మనందరికి స్పష్టంగా అర్థమైంది. డబ్బున్నా లేకపోయినా అందరం ప్రతిరోజూ పనిచేయాలి.

జాబ్ మానేస్తాను అంటే ఓనర్ బ్రతిమాలెలా ఉండాలే తప్ప, ఓకే సర్ వెళ్లిపోండి అనేలా ఉండకూడదు. చివరగా ఒక సీక్రెట్ చెప్త.. “ఇష్టమైన పనిలో ఉంటే జీవితాంతం పనిచేయక్కర్లే, ప్రతీ రోజు హాలిడే”.

Listen to Puri Musings – WORK


Video Credit: Puri Jagannadh (YouTube)

Scroll to Top