‘గ్రాండ్‌పా కిచెన్‌’ ఈ పేరు పెద్దగా పరిచయం లేదు యూట్యూబ్‌ ఫాలో అయ్యే వారికి. ఈ ఛానల్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది
వంటల తాత నారాయణ రెడ్డి. ఆయన చేసే వంటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

2017 ఆగష్టులో స్థాపించిన ‘గ్రాండ్‌పా కిచెన్‌’ యూట్యూబ్‌ ఛానల్ అనతికాలంలోనే దాదాపుగా 6 మిలియన్ల సబ్‌స్ర్కైబర్ల పైనే సంపాదించుకున్న నారాయణ రెడ్డి (73) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణా ప్రాంతానికి
చెందిన నారాయణ రెడ్డి అక్టోబర్ 27న పరమపదించారు.

Grandpa Kitchen

అక్టోబరు 24న తన ఛానల్ ద్వారా లైవ్ లో కనిపించిన 3 రోజులకే తుదిశ్వాస విడిచారు. అనాథలకు, పేదపిల్లలకు తను చేసే
వంటలను వడ్డించేవాడు. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పేదపిల్లలకు పుస్తకాలు, బట్టలు పంచిపెట్టేవారు.
సమాజానికి మంచి చేయాలని ప్రపంచానికి చెప్పే వంటల తాత మృతికి నెటిజెన్లు సంతాపం ప్రకటించారు.

వంటల తాత చివరి వంటకం ‘క్రిస్పి పొటాటో ఫింగర్స్’ సెప్టెంబర్ 20న చేశారు. పొలాల్లో, చెలకల్లో కట్టేలపోయి మీద చేసీ అద్బుతమైన వంటకాలకు ఇతర దేశస్తులు కూడా ఫిదా అయ్యారు. తను చేసే వంటకాల్లో విదేశీ వంటకాలు కూడా ఉండడం విశేషం.