హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి. ఈరోజు సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ అంశం మీద మాట్లాడారు. హెలికాప్టర్ మనీ గురించిన విషయాలు తెలుసుకుందాం. ఇది నిజంగా ఉపయోగపడుతుందా ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్ధిక సంక్షోభానికి. ప్రభుత్వాల రుణభారాన్ని పెంచడం కంటే, ‘హెలికాప్టర్ మనీ’ నే సరైన సాధనమేమో.

హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి

కరోనావైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్రాలకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడున్న పరిస్థితి మరింతకాలం ఉంటే ఆర్థిక సంక్షోభం తప్పదు. దీన్ని అధిగమించడానికి కెసిఆర్ గారు  (ఎఫ్‌ఆర్‌బిఎం) చట్టం కింద ‘హెలికాప్టర్ మనీ’ మార్గాన్నిసూచించారు.

హెలికాప్టర్ మనీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది మిల్టన్ ఫ్రైడ్మాన్. ద్రవ్యోల్బణం మరియు ఆర్ధిక ఉత్పత్తిని పెంచడానికి చివరగా ఏలాంటి అవకాశాలు లేనప్పుడు ద్రవ్య ఉద్దీపన వ్యూహాన్ని సూచిస్తుంది. ఇది ఒక ఆర్థిక విధానం. ఆర్థిక సహాయం చేయడం అని చెప్పవచ్చు. సామాన్య జనులకు అర్థమయ్యేలా చెప్పాలంటే… ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వరదలు, అగ్ని ప్రమాదాల వంటివి సంభవించినప్పుడు హెలికాప్టర్ సహాయంతో ఆదుకుంటారు, ఆహారం జారవిడుస్తారు. అలానే ఆర్థిక పరిస్థితి పూర్తిగా మూసుకుపోతున్న సమయంలో ఆర్థికంగా ఆదుకునే మార్గాన్నే హెలికాప్టర్ మనీ అంటారు.

ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు పెద్ద మొత్తంలో డబ్బును ముద్రించి ప్రజలకు/ప్రభుత్వాలకు పంపిణీ చేయడం హెలికాప్టర్ మనీ.

అయితే ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన పని లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదే విషయాన్నీ ప్రధానమంత్రి మోడీకి చెప్పారు. ఒకవేళ ఇందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపితే రాష్ట్రానికి 10 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కెసిఆర్ చెప్పారు.

ఈ విధానం వల్ల ఖచ్చితంగా రాష్ట్రాలకు చాలా పెద్ద ఊరట. కాకుంటే ఇందులో కొన్ని న్యాయపరమైన అంశాలు కొన్ని ఉంటాయి. చివరగా, చట్టపరమైన సమస్యలను పక్కన పెడితే, ఇది ఒకవిధంగా శక్తివంతమైన సాధనం. మరి దీన్ని ఈ క్లిష్ట సమయంలో ఉపయోగిస్తారో లేదో చూడాలి.

Also Read: Minister Funny Speech