రాష్ట్ర శాసనమండలిని ఎవరు రద్దు చేయవచ్చు?

రాష్ట్ర శాసనసభలో సాధారణ బిల్లు ఎలా ఆమోదించబడుతుంది?

భారతదేశంలో శాసన మండలి లేని రాష్ట్రం ఏది?

ఏపీ శాసన మండలి రద్దు చేసే ఆలోచనలో సీఎం జగన్ ముందుకు సాగుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి రద్దు చేసే అధికారం ఎవరికుంది, రద్దు చేయాలంటే ఏలాంటి విధివిధానాలు అవసరమో తెలుసుకుందాం.

రాష్ట్ర శాసన మండలి రద్దు ఎవరి చేతుల్లో పని?

రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలంటే అంతా తేలికగా జరిగేపని కాదు. రద్దు చేయడానికి చాలా నియమాలు ఉన్నాయి.

  • రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలన్నా మరియు పునరుద్దరించాలన్నా అందుకు తగ్గ అధికారం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంది.
  • ఇందుకు భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ తోడ్పడుతుంది.
  • రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
  • తీర్మానానికి ఓటింగ్‌లో 2/3వ మెజారిటీ మద్దతు ఉండాలి.
  • శాసన మండలిని ఏర్పాటుచేసినప్పుడు లేదా రద్దు చేసినప్పుడు, భారత రాజ్యాంగం కూడా మార్చబడుతుంది. అయినప్పటికీ, అటువంటి చట్టాన్ని రాజ్యాంగ సవరణ బిల్లుగా పరిగణించలేము (రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు).
  • రాష్ట్ర శాసనమండలిని ఏర్పాటు/రద్దు చేయాలనే తీర్మానాన్ని రాష్ట్రపతి కూడా అంగీకరించాల్సి ఉంటుంది.

రాష్ట్ర శాసనసభలో సాధారణ బిల్లు ఎలా ఆమోదించబడుతుంది?

  • రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం మీద చర్చించి ఆమోదం తెలపాలి (తప్పనిసరి కాదు).
  • సంబందిత రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఓటింగ్ నిర్వహించాలి. అందుకు తీర్మానానికి మద్దతుగా ఓటింగ్‌లో 2/3వ మెజారిటీ కావాలి.
  • ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర క్యాబినేట్ లొ చర్చించి దానికి పార్లమెంట్ ఉభయ సభలకు పంపిస్తుంది.
  • అయితే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మానంలో ఎందుకు మండలి రద్దు లేదా ఏర్పాటు చేయాలో చేస్తున్నామో అందుకు తగ్గ కారణాలు తెలపాల్సిన అవసరం లేదు.
  • పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
  • చివరగా పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి.

భారతదేశంలో శాసన మండలి లేని రాష్ట్రం ఏది?

భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అసలు శాసన మండలి లేనేలేదు. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన సభతో పాటు మండళ్లు ఉన్నాయి.

శాసన మండలి ఉన్న రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో శాసన మండలి ఉంది. పశ్చిమ బెంగాల్‌కు ఇంతకుముందు కౌన్సిల్ ఉన్నప్పటికీ, అది 1969 లో రద్దు చేయబడింది. మరియు జమ్ము కాశ్మీర్ లో తాజాగా శాసన మండలి రద్దయింది.