ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

గిరిజా క్షమించు అమృతా అమ్మ దగ్గరికి రా! – ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో ఉన్న ఆర్యవైశ్య భవన్ మూడో అంతస్థు రూం నెంబర్ 306 గదిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే శనివారం తన డ్రైవర్ రాజేష్ తో కలిసి మారుతీరావు ఆర్యవైశ్య భవన్ లో దిగాడు. డ్రైవర్ బయటే ఉండగా అతను గదిలోనే ఉన్నాడు. భార్య చేసిన ఫోన్ కాలును ఎంతకూ సమాధానం లేకపోవడంతో […]

Read More
Errabelli Dayakar Vs Rajagopal Reddy

Errabelli Dayakar Vs Rajagopal Reddy అసెంబ్లీ లో మాటల యుద్ధం – వీడియో

Errabelli Dayakar Vs Rajagopal Reddy. ఈరోజు (07.03.2020) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మాటల యుద్ధం జరిగింది. అసలేం జరిగిందంటే… కెసిఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకుంటే కొన్ని ప్రాంతాలకే ముఖ్యమంత్రో అర్ధం అవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు, ప్రభుత్వానికి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి మీద లేదు, పాత ట్యాంకులు పాత పైపులే మిషన్ భగీరథలో ఉన్నాయి […]

Read More
డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ – 14 రోజుల రిమాండ్‌

మంత్రి కేటీఆర్ లీజ్ కు తీసుకున్న ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారనే ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు రేవంత్‌ రెడ్డిని ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసం ఉండే రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో హాజరు పర్చారు. దీంతో జడ్జ్ రేవంత్‌కు 14 రోజుల రిమాండ్‌ […]

Read More
Rahul Sipligunj Reaction on PUB Attack

Rahul Sipligunj Reaction on PUB Attack – రాహుల్‌ సిప్లిగంజ్‌ మీడియా ముందుకు

హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై తలపై బీరుసీసాలతో దాడి సంఘటన తెలిసిందే. అయితే ఈ దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడాడు. దాడి చేసిన వాళ్ళు వాష్ రూమ్ కు వెళ్లి వస్తూ అసభ్యంగా మాట్లాడుతూ డాష్ ఇస్తూ వెళ్తుంటే నేను వారిని ఆపి అడిగా, వారు దాదాపు 15 మంది ఉన్నారు, కావాలని గొడవ పెట్టుకొని బీరు సీసాలతో దాడి […]

Read More
పుకార్లు వదంతులు నమ్మవద్దు ఈటెల

కరోనా వైరస్ కి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసిన తెలంగాణ మంత్రి ఈటెల

కరోనా వైరస్ తెలంగాణాలో విస్తరిస్తున్న పలు వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకేఒక్క కేసు నమోదైందని అది కూడా దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి. 47 మందికి గాంధీ ఆసుపత్రిలో స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 45 మందికి నెగటివ్ అని చూపించగా మరో ఇద్దరి వ్యక్తుల రిపోర్టులను స్పష్టత కోసం పుణె కు పంపించినట్టు ఈటెల వెల్లడించారు. ఈ 45 మందిని ఇంటికి పంపించాము. వారు […]

Read More
కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కరోనా వైరస్ సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు

కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రభావం కారణంగా సికింద్రాబాద్ మారేడ్ పల్లి పరిసారాల్లోని మహేంద్ర హిల్స్‌ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదు కావడంతో మహేంద్ర హిల్స్‌లో వైరస్ విస్తరించకుండా బాధితుడి ఇంటి నుండి 5 కిలోమీటర్ల పరిధిలో హెల్త్ అలర్ట్‌ను ప్రకటించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వైరస్ నివారణలో భాగంగా ముమ్మరంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టింది. 19 ఫిబ్రవరి 2020న దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చి 22న […]

Read More
చైతన్య పురిలో ట్రాక్టర్ భీభత్సం

హైదరాబాద్ చైతన్య పురిలో ట్రాక్టర్ భీభత్సం – ఏలాంటి ప్రాణాపాయం జరగలేదు

హైదరాబాద్ లోని చైతన్య పురిలోని గణేష్‌పురి కాలనీలో వెళుతున్న ట్రాక్టర్ సృష్టించిన భీభత్సానికి ఒక కారు, అయిదు బైకులు ధ్వంసం అయ్యాయి. ఒకరికి గాయాలయ్యాయి. భవన నిర్మాణ వ్యర్థాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి ఇంటి ముందు పార్క్ చేసిన పలు వాహనాల మీదకు దూసుకుపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి రోడ్డు పక్కన ఒక ఇంటి ముందు పడిపోగా అదే ట్రాక్టర్ మీద కూర్చున్న మరొక వ్యక్తి గట్టిగా ట్రాక్టర్ ను పట్టుకొని ఉండడంతో అతనికి ఏమీ […]

Read More
ఔచిత్యం చాటిన కేసీఆర్‌

ఔచిత్యం చాటిన కేసీఆర్‌ – కాన్వాయ్ ఆపి వికలాంగ వృద్ధుడి వ్యధ విన్న సీఎం

హైదరాబాద్ టోలిచౌకిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కేసీఆర్‌ మార్గ మధ్యంలో ఒక వికలాంగ వృద్ధుడి చేతిలో విన్నప పత్రం పట్టుకొని ఎదురుచూస్తున్న అతన్ని చూసి వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి వెళ్ళాడు. ఓపికగా తనకున్న సమస్యలు విన్న సీఎం వెంటనే స్పందించడమే కాకుండా అతని సమస్యను  పరిష్కరించి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన పేరు సలీమ్‌ అని పరిచయం చేసుకున్న ఆ వృద్దుడు సమస్యలు చెప్పుకున్నాడు. గతంలో డ్రైవర్ గా పనిచేసేవాడినని, గత తొమ్మిది […]

Read More
గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నం

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నం – అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ వసంత్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. పొత్తి కడుపులో పెట్రోల్ బ్యాగ్లు పెట్టుకొని చేతులో లైటర్ పట్టుకొని సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏమి జరుగుతుందో తెలియక రోగులు మరియు వారి బంధువులు అయోమయంలో పడ్డారు. దాదాపుగా గంటన్నర పాటు ఈ హైడ్రామా జరిగింది. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఎంత వారించినా డాక్టర్ వసంత్ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించలేదు. మీడియా ముందు హెచ్ఓడి తో  మాట్లాడుతుండగా ఒక్కసారిగా […]

Read More
సమత కేసు నిందితులకు ఉరిశిక్ష

సమత కేసు నిందితులకు ఉరిశిక్ష – ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

సమత అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఈరోజు (30/01/2020) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు దోషులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్ధుంలకు ఉరిశిక్షను విదిస్తు న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువడించిన మరుక్షణం నిందితులు కంటతడి పెట్టుకున్నారు. ఇది దారుణమైన హేయమైన చర్య అని తన తీర్పులో కోర్టు తెలిపింది. న్యాయస్థానం తీర్పుతో సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 24న కొమురంభీం అసిఫాబాద్ […]

Read More